16 July, 2026 | 12:22 AM

కెప్టెన్సీకి నేను సిద్ధం: స్మృతి

16-07-2026 12:00 AM

లండన్, జూలై 15 : భారత మహిళల క్రికె ట్ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్టార్ బ్యాటర్ స్మృ తి మంధాన చెప్పింది. తాజాగా ఓ ఇంటర్యూలో స్మృతి కెప్టెన్సీకి సంబంధించి ఆసక్తిక ర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ స్థానంలో భవిష్యత్తులో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధమని తెలిపింది. ప్రస్తుతం భారత జట్టుకు స్మృతి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును సక్సెస్‌ఫుల్‌గా నడిపించిన అనుభవం ఆమెకు ఉంది.ఎంతో ఒత్తిడితో కూడిన మ్యాచ్‌లలో కూడా కూల్‌గా నిర్ణయాలు తీసుకుని జట్టును నడిపించిన అను భవం కూడా స్మృతి మంధానకు ఉంది.

ఆ నైపుణ్యమే స్మృతి మంధానను కెప్టెన్సీ రేసు లో నిలబెట్టింది.ఆమె 18 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు, నాలుగు వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించింది. వీటిలో 15 మ్యాచ్‌ల లో జట్టును విజయపథంలో నడిపించింది. ఆమె నాయకత్వంలో ఆడిన నాలుగు వన్డేలలోనూ భారత జట్టు విజయం సాధించింది. కాగా లార్డ్స్‌లో చారిత్రక విజయం సాధించడం ఎంతో ఉద్వేగాన్ని ఇచ్చిందని పేర్కొం ది. ఇలాంటి విజయంలో తాను కూడా భాగమైనందుకు చాలా గర్వంగా ఉందని చెప్పు కొచ్చింది. ఈ మ్యాచ్‌లో ఆమె రెండు ఇన్నింగ్స్‌లలోనూ హాఫ్ సెంచరీలు చేసింది.