2 August, 2026 | 7:46 AM

బంజారా భవనంకు భూమి కేటాయించండి

03-09-2025 12:06 AM

మేడిపల్లి: కేసుల చారిటబుల్ ట్రస్ట్ సేవ సంస్థ, ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ సీతల భవాని,  సద్గరు సేవాలాల్ మహారాజ్, బంజారా సంస్కృతిక భవనం కు  భూమి కేటాయించాలని అడిషనల్ కలెక్టర్ డి విజేందర్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు. 20 సంవత్సరాలుగా చెంగిచర్ల, బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో, దాదాపు 10,000 కుటుంబాలు  నివసిస్తున్నాయని, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు,గిరిజన ప్రజల వారసత్వాన్ని కాపాడేందుకు, సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు 4 ఎకరాల భూమి  కేటాయించాలని కోరామని, దానికి  అడిషనల్ కలెక్టర్ సాను కూలంగా స్పందించారని తెలిపారు.