2 August, 2026 | 8:55 AM

మహిళ దారుణ హత్య

03-09-2025 12:05 AM

మహబూబాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ శివారు పురుషోత్తమయ్య గూడెం వద్ద  ఉల్లేపల్లి గ్రామానికి చెందిన బంటు వెంకటమ్మ (55) దారుణ హత్యకు గురైంది. భవన నిర్మాణ కూలిగా పనిచేస్తున్న ఆమె సోమవారం కూలి పనులకు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు.

కుటుంబ సభ్యులు ఫోన్ చేసినప్పటికీ సమాధానం రాకపోవడంతో వెతుకులాట ప్రారంభించారు. మంగళవారం పురుషోత్తమాయగూడెం వద్ద నీటిగుంటలో ఆమె మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మరిపెడ ఎస్త్స్ర సతీష్ తెలిపారు.