21 March, 2026 | 1:57 PM

Breaking News

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మైనంపల్లి సర్పంచ్   •   నిరుపేద ముస్లింలకు రంజాన్ మోదీ కిట్‌ల పంపిణీ   •   రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే తోటలక్ష్మికాంతారావు   •   బీసీలకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం   •   ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం   •   జీవన్ రెడ్డికి బుజ్జగింపులు.. తన నిర్ణయంలో మార్పులేదన్న సీనియర్ నేత   •   తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •  

టూరిజం కార్పొరేషన్ మాజీ ఎండీపై చీటింగ్ కేసు

21-09-2024 02:51 AM

 హైదరాబాద్, సెప్టెంబర్ 20(విజయక్రాంతి): టూరి జం కార్పొరేషన్ మాజీ ఎండీ మనోహర్ రావుపై చీటింగ్ కేసు నమోదైం ది. టూరిజం కార్పొరేషన్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ రమేశ్‌నాయక్ ఇచ్చి న ఫిర్యాదు మేరకు నారాయణగూడ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశా రు. మనోహర్ ఎండీగా ఉన్నప్పుడు దుర్గం చెరువు ఎకో పార్కు టెండర్లలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2018 జూన్ 20వ తేదీ న దుర్గంచెరువు ఎకో పార్కు లీజు  టెండర్లను కమల్ హోటల్స్ ప్రైవేట్ లిమిటేడ్ అత్యధిక బిడ్డింగ్ వేసి టెండర్‌ను దక్కించుకుంది.

ఆ తర్వాత కమ ల్ హోటల్స్ పేరు మీద అవార్డ్ లెటర్ ను టీజీటీడీసీ జారీ చేసింది. ఆ తర్వా త కమల్ హోటల్స్ యాజమా న్యం ఎ.ఎ..అవోకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థను తమ అనుబంధ కంపెనీగా పేర్కొంది. కొన్ని రోజుల తర్వాత అసలు బిడ్డింగ్‌లో పాల్గొనని అవోకేష న్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరు మీద పార్కు లీజు పత్రాలను మార్చుకున్నారని, దీనికి అప్పటి ఎండీ మనో హర్ రావు సహకరించారని  ఫిర్యాదులో పేర్కొన్నారు.  పోలీసులు  మనరోహర్‌పై కేసు నమోదు చేశారు.