తనిఖీలు నిలిపివేయాలి
14-06-2024 01:46 AM
సీఎంకు ఆర్‌ఎంపీల వినతి
మంచిర్యాల, జూన్ 13 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా ఆర్‌ఎంపీ, పీఎంపీలపై నిర్వహిస్తున్న తనిఖీలను నిలిపివేయాలని తెలంగాణ ఆర్‌ఎంపీ, పీఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు కోరారు. రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారని వారు తెలిపారు. వినతిపత్రాన్ని అందజేసిన వారిలో రాష్ట్ర అధ్యక్షుడు నేతి నాగేశ్వర్‌రావు, గౌరవ అధ్యక్షుడు హన్మంతరావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రాజమౌళి, ఉపాధ్యక్షుడు రొడ్డ రాజేశం, ప్రచార కార్యదర్శి చుంచు శంకర్‌వర్మ, పట్టణ నాయకులు వెంకటేష్ ఉన్నారు.






