14 July, 2026 | 6:00 PM

నాగపురం గేటు వద్ద చిరుత సంచారం

06-07-2024 12:33 AM
  • మరో రెండు ఉన్నట్లు సమాచారం ? 
  • స్వయంగా వీడియో తీసిన మెదక్ ఎస్‌ఐ 
  • భయాందోళనకు గురవుతున్న తండావాసులు

మెదక్, జూలై 5(విజయక్రాంతి): మెదక్ జిల్లా హవేళిఘణపురం మండలంలో చిరుత పులి సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నది. శుక్రవారం రాత్రి మెదక్ ప్రధా న రహదారిపై నాగపురం గేటు వద్ద చిరుత కనిపించింది. ఆ రహదారి గుండా వెళ్తున్న మెదక్ టౌన్ ఎస్‌ఐ పోచయ్య చిరుత సంచరిస్తున్న వీడియో తీశారు. ఆయన వెంటనే నాగపురం గేట్ వద్ద ఉన్న గిరిజన తండావాసులతో పాటు ఫారెస్టు అధికారులకు సమాచారమిచ్చారు. ఇంకా రెండు, మూడు చిరుతపు లులు సంచరిస్తున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తండావసులు భయాందోళనకు గురవుతున్నారు.