14 July, 2026 | 6:34 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు

14-07-2026 05:58 PM

ఈనెల 17న ఐఎఫ్టియు ఆధ్వర్యంలో భారీ ధర్నా

కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) ఆధ్వర్యంలో కొత్తగూడెం సులబ్ సఫా యి కర్మ చారి కార్మికులతో  జనరల్ బాడి సమావేశం రైటర్ బస్తీ లోని స్థానిక IFTU కార్యాలయం లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి సులభ్ వర్కర్స్ యూనియన్ (IFTU) కొత్తగూడెం రీజియన్  కార్యదర్శి యన్. సంజీవ్ మాట్లాడుతూ, సింగరేణి వ్యాప్తంగా సుమారు  200 కు పైగా మరుగుదొడ్లను సింగరేణి యాజమాన్యం గత 30 సంవత్సరాల క్రితం సులబ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థకు అప్పగించింది.

సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ కార్మికులను నియమించింది. ఈ కార్మికులకు గత మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించడం లేదు.  వీరికి ఎలాంటి కార్మిక చట్టాలు వర్తించవని మాది స్వచ్ఛంద సంస్థని సులభ్ సంస్థ బుకాయిస్తుంది. సింగరేణి యాజమాన్యం ఒక్కొక్క సులభ్ కాంప్లెక్స్ కి 25 వేల రూపాయలు చెల్లిస్తే కార్మికులకు 15 వేల రూపాయలు ఇచ్చి మిగతా డబ్బులు అన్ని సులభ్ సంస్థలే వాడుకుంటుంది. కానీ ఈ కార్మికులకు ప్రతినెల వేతనాలు చెల్లించడం గానీ ఈఎస్ఐ, ఈపీఎఫ్ తదితర చట్టబద్ధమైన హక్కులు కల్పించడంలో సింగరేణి యాజమాన్యంగాని, సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ సంస్థ  వైఫల్యం చెందుతుంది.

ఈ కార్మికులకు హాస్పటల్ సౌకర్యం లేకపోవడంతో  నిత్యం మరుగుదొడ్లను క్లీన్ చేసే కెమికల్స్ బ్లీచింగ్ పౌడర్, యాసిడ్, ఫినాయిల్. వల్ల అనేక రకాల వృత్తి సంబంధమైన వ్యాధులు వచ్చి చనిపోతున్నారు. సింగరేణి యాజమాన్యం ఇతర కాంట్రాక్ట్ కార్మికులకు చట్టం ప్రకారం 8.33% బోనస్, సీఎం పిఎఫ్ అమలు చేస్తున్నారు, కానీ ఈ సులభ్ సంస్థలో పనిచేసే కార్మికులకు మాత్రం అమలు చేయలేదని అన్నారు. ఇప్పటికైనా సులభ్ సంస్థలో పనిచేసే కర్మ చారి కార్మికులకు ఈఎస్ఐ, ఈపీఎఫ్,బోనస్, చట్టం ప్రకారం హక్కులు, సౌకర్యాలు అమలు చేయాలని ఈ నెల 17న కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ముందు ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహిస్తున్నాం అని అన్నారు ఈ ధర్నా కార్యక్రమం లో సింగరేణి వ్యాప్తంగా సులాబ్ లలో పనిచేస్తున్న సఫాయి కర్మచారి కాంట్రాక్ట్ కార్మికులందరూ పాల్గొని ఈ ధర్నా  కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం.