14 July, 2026 | 6:19 PM

వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన

14-07-2026 05:46 PM

మునిపల్లి,(విజయక్రాంతి): మండలంలోని బుధేరా, కంకోల్ గ్రామాల్లో పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, కంది తదితర పంటలను మంగళవారం ఏవో అనితారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఎండలు కొట్టడంతో భూములు బెట్టకు వస్తున్నాయని, కలుపు నివారణ కోసం మందులు కొట్టరాదని రైతులకు సూచించారు. అలాగే పంటలకు ఏవైనా మందులు పిచికారి చేస్తే తమ సూచనలు, సలహాలు తీసుకొని చేయాలన్నారు. ఆమె వెంట ఏవోలు నిఖిత, మహేష్ కుమార్, రైతులు వీరన్న, పరమేష్, నాగేష్ తదితరులు ఉన్నారు.