25 July, 2026 | 1:32 AM

చెన్ను లవ్ స్టోరీ సరికొత్త రికార్డు

25-07-2026 12:22 AM

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరిప్రియ జంటగా నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ‘. ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్లపై ఎస్‌కేఎన్, సాయిరాజేశ్ నిర్మించారు. సాయి రాజేశ్ కథను అందించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. శుక్రవారం రిలీజ్‌కు వచ్చిన ఈ మూవీకి గురువారం పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. ఈ పెయిడ్ ప్రీమియర్స్‌తోనే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోందీ సినిమా.

ఒక ప్రేమకథలో ఏ సినిమాకు రానంత కలెక్షన్స్‌ను పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే రాబట్టింది. ఈ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా రూ.3.13 కోట్ల వసూళ్లు రావడం ఆనందంగా ఉందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ చిత్రానికి డీవోపీ: విశ్వాస్ డేనియల్; సంగీతం: మణిశర్మ; ఎడిటర్: సంతోష్ నాయుడు; ఆర్ట్: భాస్కర్ ముదావత్.