25 July, 2026 | 1:19 AM

విద్యుత్ సరఫరాలో ప్రభుత్వం విఫలం

25-07-2026 12:49 AM
  1. థర్మల్ పవర్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని పునరుద్ధరించాలి
  2. మాజీ మంత్రి హరీశ్‌రావు
  3. యాదాద్రి జిల్లా సోలిపేట విద్యుత్ సబ్‌స్టేషన్ తనిఖీ

నల్లగొండ బ్యూరో, జూలై 24 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా నిరంతరాయ విద్యుత్, తాగు, సాగునీటి సరఫరాలో కాంగ్రె స్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలంలోనీ సోలిపేట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను శుక్రవారం ఆలే రు మాజీ ఎమ్మెల్యే గోంగిడి సునీతతో కలిసి తనిఖీ చేశారు.

సబ్‌స్టేషన్ లాగ్‌బుక్‌ను పరిశీలించి, విద్యుత్ శాఖ సిబ్బందితో మాట్లాడి, వ్యవసాయ విద్యుత్ సరఫరాకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. ఇక్కడ మహిళలు రెండు రోజులకు ఒకసారి మాత్రమే తాగునీటిని సరఫరా చేస్తున్న ట్లు ఫిర్యాదు చేశారని చెప్పారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన మిషన్ భగీ రథ వ్యవస్థను నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

సంగారెడ్డి, నారాయణఖేడ్, ఆందోల్, జహీరాబాద్, కామారెడ్డి, యాదాద్రి, న ల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రజ లు తాగునీటి కొరతను ఎదుర్కొంటున్నారని చెప్పా రు. గతంలో రైతులకు రోజుకు 14 నుంచి 15 గంటల విద్యుత్ అందేదని అయితే  ప్రస్తు తం రోజుకు 12 గంటలకు తగ్గించారని సబ్‌స్టేషన్ ఆపరేటర్ తనకు చెప్పినట్టు పేర్కొన్నా రు.  ప్రభుత్వం విద్యుత్ సరఫ రాను తగ్గిస్తూ, సంక్షేమ, వ్యవసాయ మద్దతులో కోత విధిస్తోందని ఆరోపించారు.

భట్టివన్నీ వట్టి మాటలేనా? 

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని డి ప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల చేసిన ప్రకటన కూడా వట్టి మాటలేనా అని ప్రశ్నించారు.  ప్రభు త్వం తగినంత బొగ్గు నిల్వలను నిర్వహించడంలో విఫలమవడం వల్లనే యాదాద్రి థర్మ ల్ పవర్ ప్లాంట్లోని 1,600 మెగావాట్ల సంయుక్త సామర్థ్యం గల రెండు యూనిట్లు చాలా నెలలుగా మూతపడ్డాయన్నారు. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లోని మరో 270 మెగావాట్ల యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందని తెలిపారు.

తెలంగాణకు సింగరేణి బొగ్గు అందుబాటులో ఉన్నప్పటికీ, 1,870 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని ఎందుకు నిరుపయో గంగా వదిలేశారని ఆయన ప్రశ్నించా రు.  అలాగే తాగునీటి సరఫరాను పునరుద్ధరించేందుకు మిషన్ భగీరథ పథకంపై రాష్ట్రవ్యాప్తంగా తక్షణ సమీక్ష జరపాలని కో రారు. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 4 వేల రైతు కుటుంబాలకు రూ.5 లక్షల రైతు బీమా  అందజేయాలని డిమాండ్ చేశారు.