తుంగతుర్తి ప్రజలారా నన్ను క్షమించండి
- నన్ను నమ్మి సామేల్‌ను గెలిపించారు
- నా అభిమానుల మద్దతుతో గెలిచి నాపైనే విమర్శలా?
- కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవడమే నా లక్ష్యం
- మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
ఆలేరు, జూలై 24 (విజయక్రాంతి): తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ కోసం మందుల సామేలు తన వద్దకు వందసార్లు వచ్చాడని, తనని నమ్మి సామేల్‌ను గెలిపించినందుకు తుం గతుర్తి ప్రజ లు, కాంగ్రెస్ కార్యకర్తలు తనను క్షమించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం ఆ యన మీడియాతో మాట్లాడారు. బాన్సువాడలో ఏనుగు రవీందర్ రెడ్డికి, తుంగతుర్తిలో మందుల సామెల్ కు కాంగ్రెస్ టికెట్ ఇప్పించింది తానేన ని చెప్పారు.
తుంగతుర్తి, నకిరేకల్, భువనగిరి, ఆలేరు, సూర్యాపేట ని యోజకవర్గాల్లో ప్రచారం చేసి కాం గ్రెస్ అభ్యర్థులను గెలిపించామ న్నా రు. మందుల సామేల్ నాపై చేసి వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. నా అభిమానుల మద్దతుతో గెలిచిన వ్యక్తి.. నేడు నాపై విమర్శలు చేయ డం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తలను కాపాడుకోవడమే తన లక్ష్యమని చెప్పారు.
సామేల్ ఎలాం టి వి మర్శలు చేసినా కోమటిరెడ్డి బ్రదర్స్ అభిమానులు, కాంగ్రె స్ కార్యక ర్తలు సహనంతో ఉండాలని సూచించారు. కాంగ్రెస్‌లో అవమానాలు భరించలేకే పార్టీ మారానని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ మారింది నేను ఒక్కణ్ణే అని రాజగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. మొదటి నుంచి కాంగ్రెస్‌ను నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరగొద్దని గాంధీభవన్‌లోనే చెప్పానన్నారు.
కడియం శ్రీహరి కాంగ్రెస్‌లోకి వస్తే ఆయన కూతురు కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామన్నారు. అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ గౌర వించిందని, తమకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. చివరగా కాంగ్రెస్ కార్యక ర్తలపై కేసులు పెడితే చూ స్తూ ఊరుకోం అని హెచ్చరించారు. నిజమైన కార్యకర్తలకు న్యా యం చేసేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.






