5 August, 2026 | 8:52 PM

శాశ్వత ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులకు సౌకర్యాలు

05-08-2026 08:18 PM

ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి

కాంట్రాక్టు కార్మికుని కుటుంబానికి 40 లక్షల రూపాయల చెక్ అందజేత

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): శాశ్వత ఉద్యోగులతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా సింగరేణి యాజమాన్యం సౌకర్యాలు కల్పిస్తున్నట్లు భూపాలపల్లి ఏరియా జీఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. కేటీకె ఓసీపి 2 ప్రాజెక్టులో ఎస్ వి ఈ సి వద్ద పనిచేస్తున్న నెల్లూరు జిల్లాకు చెందిన కాంట్రాక్టు కార్మికుడు సప్పిడి శ్రీహరి ఇటీవల ప్రమాదంలో మృతి చెందాడు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచే ఉద్దేశంతో సింగరేణి సంస్థ వివిధ బ్యాంకులతో ప్రమాద బీమా ఒప్పందం కుదుర్చుకుంది.

అందులో భాగమూగ పంజాబ్ నేషనల్ బ్యాంకుతో గల ఒప్పందం మేరకు సప్పిడి శ్రీహరి భార్య స్రవంతి, వారి పిల్లలు ఉషశ్రీ, మహేష్ లకు 40 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును బుధవారం ఏరియా జీఎం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ భూపాలపల్లి బ్రాంచ్ మేనేజర్ గుగులోత్ కళ్యాణ్ అందజేశారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు సింగరేణి సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓసీపి 2 ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్యామ్ సుందర్, ఎస్ వి ఈ సి ప్రాజెక్ట్ మేనేజర్ మహ్మద్ అలీ, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.