మోడల్ స్కూల్లో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు
- విద్యార్థులకు ఎస్సై కే. ప్రశాంత్ రెడ్డి సూచనలు
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలంలోని మోడల్ స్కూల్లో ఎస్సై కే. ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్‌లో వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, ఓటీపీ వంటి వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
సైబర్ నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించిన ఎస్సై, ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. విద్యార్థులు డిజిటల్ ప్రపంచంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అనుమానాస్పద లింకులు, సందేశాలకు స్పందించవద్దని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని సైబర్ భద్రతకు సంబంధించిన పలు అంశాలపై అవగాహన పొందారు.






