5 August, 2026 | 9:37 PM

సైబర్ నేరాల పట్ల జాగ్రత్తలు పాటించాలి

05-08-2026 08:23 PM

మోతె,(విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఎస్ఐబి లచ్చి రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో జిల్లా పరిష్యత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల తో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరు డబ్బులు ఫ్రీగా ఇవ్వరని ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆశ చూపి మనకు వాట్సాప్ లో పేస్ బుక్ లో వచ్చే లింక్ లు ఓపెన్ చేసి మోస పోవద్దని లోన్ యాప్ ల మాయలో పడి అవసరానికి డబ్బులు వస్తాయని సైబర్ మోసగాళ్ళ ఉచ్చులో పడి ఆర్ధికంగా నష్ట పోవద్దని చెప్పారు. పిల్లలు ఎవరు  ఫోన్ లలో బెట్టింగ్ వ్యాపారం చేయవద్దని ఫోన్ పట్ల అవగాహన లేని తల్లిదండ్రులకు తెలియకుండా కొత్త కొత్త యాప్ లు డౌన్ లోడ్ చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమం లో ఏ యస్ ఐ పి మల్లయ్య, సిబ్బంది హెచ్ యం శోభా బాయి, లింగయ్య, లింగరాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.