08-02-2026 12:00:00 AM
ప్రశంసల జల్లు కురిపించిన రాజస్థాన్ అడిషనల్ డీజీ రామ్‌జీ
కుషాయిగూడ ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని చర్లపల్లి సెంట్రల్ జైలు నిర్వహణ దేశంలో ఆదర్శంగా ఉందని రాజస్థాన్ రాష్ట్ర జైళ్ల శాఖ అడిషనల్ డైరెక్టర్ జనరల్ రామ్‌జీ అన్నారు. గురువారం చర్లపల్లి సెంట్రల్ జైలును సందర్శించి అక్కడ అమలవుతున్న భద్రతా, పరిపాలనా, ఖైదీల సంక్షేమ కార్యక్రమాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జైలు మొత్తం పరిశుభ్రత, క్రమశిక్షణ, సాంకేతిక పరిజ్ఞాన వినియోగం తనను ఎంతో ఆకట్టుకున్నాయని రామ్‌జీ తెలిపారు.
ఖైదీల పట్ల మానవీయ దృక్పథంతో పాటు కఠిన భద్రతను సమన్వయం చేస్తూ జైలును సమర్థంగా నిర్వహిస్తున్న తీరు అభినందనీయ మని పేర్కొన్నారు. సందర్శనలో భాగంగా ఖైదీల నివాస విభాగాలు, భద్రతా గోడలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ కేంద్రం, వంటశాల, వైద్య విభాగాన్ని రామ్ జీ పరిశీలిం చారు. రామ్‌జీ వెంట జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ శ్రీనివాసరావు, రామ్ జీ, చర్లపల్లి సెంట్రల్ జైలు పర్యవేక్షణ అధికారి ప్రమోద్, జైలు పరిరక్షణ అధికారి భరత్, ఉప పర్యవేక్షణ అధికారులు శశికాంత్, కాళిదాస్, జైలర్ శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.