20 July, 2026 | 5:38 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

జీవితానికి చెస్ ఆట దిక్సూచి: గంగుల కమలాకర్

20-07-2026 12:00 AM

కొత్తపల్లి,జూలై19(విజయక్రాంతి): జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 4వ జాతీయ జూనియర్ చెస్ పోటీలు కరీంనగర్లో ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ విజేతలకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో విద్యార్థులు సెల్ఫోన్లకు బానిసలు కాకుండా, మేధోశక్తిని, మానసిక దృఢత్వాన్ని పెంచే చెస్ వంటి క్రీడల వైపు వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రుల కృషి అభినందనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్, బీఆర్‌ఎస్ నాయకులు మైకేల్ శ్రీనివాస్, చెస్ అకాడమీ నిర్వాహకులు అనూప్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పోటీల నిర్వహణకు సహకరించిన స్పాన్సర్లను నిర్వాహకులు సన్మానించారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను అకాడమీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు.