20 July, 2026 | 5:38 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

ఎల్ నినోను ఎదుర్కోవడంలో కరీంనగర్ నాంది కావాలి

20-07-2026 12:00 AM

ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, స్పెషల్ సీఎస్ మహేశ్ దత్ ఎక్కా

కరీంనగర్, జూలై 19 (విజయ క్రాంతి): ఎల్నినో ప్రభావంతో ఏర్పడే విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో కరీంనగర్ ఉమ్మ డి జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని, అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలోకి దిగి రైతులు, ప్రజలను అప్రమత్తం చేయాలని ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ మహేశ్ దత్ ఎక్కా ఆదేశించారు.

ఆదివారం కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి జిల్లాల వా రీగా సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, కరీంనగర్లో ముందస్తుగా ఆదివారమే సమీక్ష నిర్వహించడం అ భినందనీయమని పేర్కొన్నారు. ఎల్నినోను ఎదుర్కొనే పోరాటానికి కరీంనగర్ నాంది కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఉమ్మడి జిల్లాలోని కలెక్టర్లు, పోలీస్ కమిషనర్, ఎస్పీ లు, వ్యవసాయ, ఇరిగేషన్, విద్యుత్, భూగ ర్భ జలాల శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు సమన్వయంతో క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులను చైతన్యపరచాలని సూచించారు. వరికి బదులుగా ఆరుతడి, ప్రత్యా మ్నాయ పంటల సాగుపై రైతులను ఒప్పించాలని, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, రైతులకు అందిస్తున్న భరోసాను ప్రతి గ్రా మానికి చేరవేయాలని ఆదేశించారు.

జలాశయాల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరి స్థితి, తక్కువ వర్షపాతం వంటి వాస్తవ పరిస్థితులను ప్రజలకు స్పష్టంగా వివరించాలని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని రైతులను ఈ సంక్షోభం నుంచి కాపాడాలని స్ప ష్టం చేశారు. ‘రైతుల సంక్షేమంతో పాటు ప్ర జలను రక్షించడమే ప్రభుత్వ లక్ష్యం‘ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్ మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం, కరువు పరిస్థి తులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శా ఖ నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తోందన్నా రు.

వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణుల సూ చనల మేరకు రైతులకు అవగాహన కల్పి స్తూ, ఆరుతడి పంటల సాగును ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. భూగర్భ జలాల పరిస్థి తి, వర్షపాతం, జలాశయాల్లో నీటి నిల్వలు, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం అందిస్తున్నా మని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర జాప్రతినిధులు చేసిన సూచనలను గౌరవి స్తూ రైతులకు మరింత చేరువయ్యేలా కార్యాచరణ అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభల ద్వారా రైతులను చైతన్యవంతం చేయడంతో పాటు, ప్రతి మంగళవారం 1,600 రైతు వేదికల్లో ‘రైతు నేస్తం‘ కార్యక్రమం నిర్వహించి వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ప్రత్యక్షంగా రైతుల కు సూచనలు అందిస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మే రకు ముందస్తు కార్యాచరణతో ఎల్నినో ప్ర భావాన్ని తగ్గించి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయం తో పనిచేస్తున్నాయని సురేంద్ర మోహన్ తెలిపారు.

అంతకుముందు పెద్దపెల్లి జిల్లాకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త సంపత్ ఎల్ నినో ప్రభావం తక్కువ వర్షపాతం నమో దు.. ఆరుతడి పంటల సాగు.. వాటి వల్ల లాభాలు.. రైతులకు అండగా ఉండేందుకు చేపట్టవలసిన చర్యలు.. భూగర్భ జలాల పెంపు తదితరు అంశాలపై అవగాహన కల్పించారు.