ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహణ
20-07-2026 12:00 AM
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ, జూలై 19 (విజయక్రాంతి): జిల్లాలోని స్పెషల్ డిప్యూటి కలెక్టర్ శాఖ యూనిట్లలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉ న్న పోస్టుల్లో అవుట్ సోర్సింగ్ ప్రతిపాదిక న భర్తీ చేయుటకు నిర్వహించిన వ్రాత పరీక్షలు విజయవంతంగా జరిగాయని జిల్లా క లెక్టర్ తెలిపారు.
స్పెషల్ డిప్యూటి కలెక్టర్, యూనిట్ -1 , 2 విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేయుటకు గాను ఆదివారం జనగామ కలెక్టరేట్ లో పరీక్ష ను నిర్వహించారు. అదనపు కలెక్టర్ బెన్ షాలోం తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరీక్ష నిర్వహణ తీరు ను పరిశీలించారు. మొత్తం 615 మంది దరఖాస్తు చేసుకోగా 446 మంది హాజరు అయ్యారు.






