దేశభక్తి, ధైర్యానికి ప్రతీక ఛత్రపతి శివాజీ
గొంగిడి సునీత
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 12: దేశభక్తి, ధైర్యానికి ప్రతీక మహారాజ్ శివాజీ అని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలోని బస్టాం డ్ సమీపంలో విగ్రహ దాత గొంగిడి సునీత మహేందర్ రెడ్డి,యువకులు ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్ఠాపన చేసేందుకు ఆదివారం భూమిపూజ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సన్మార్గంలో ప్రయాణించాలని పిలుపునిచ్చారు. శివాజీ మహారాజ్ దేశభక్తి, ధైర్య సహసాలకు, నిలువెత్తు ప్రతీక అని కొనియాడారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం యువతకు నిత్యం స్ఫూర్తి దాయకమని పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో యువత ప్రయాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిన్నం మల్లయ్య, వార్డు సభ్యులు, యువకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




