వ్యక్తి అదృశ్యం
13-04-2026 12:00 AM
మేడిపల్లి,ఏప్రిల్ 12 (విజయక్రాంతి): షాపుకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేకానంద కాలనీ, రోడ్ నెంబర్ 1, మేడిపల్లి కి చెందిన మార్క లక్ష్మణ్ (29) గవర్నమెంట్ స్కూల్ దగ్గర ఉంటూ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు.
అతని తండ్రి మార్క కుమార్ (60) 10వ తేదీ నాడు రాత్రి 8 గంటల సమయంలో షాపుకు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుండి బయలుదేరి మరల ఇంటికి తిరిగి రాలేదు . అతని గురించి చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, ఈ విషయంపై అతని కొడుకు లక్ష్మణ్ మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.




