03-11-2025 04:41:17 PM
మఠంపల్లి: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు పెన్నిదని మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాలోతు సక్రు నాయక్ అన్నారు. సోమవారం రాష్ట్ర భారీ నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో మంజూరైన 30 వేల రూపాయలు చెక్కును మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామానికి చెందిన బానోతు లచ్చుకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని, ముఖ్యమంత్రి సహాయ నిధి పధకంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.