calender_icon.png 6 December, 2024 | 3:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆహ్వానం

01-11-2024 09:03:09 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అంగరంగ వైభవంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకావాలని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆయన నివాసంలో శుక్రవారం కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు తప్పకుండా విచ్చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కురుమూర్తి స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్, ఈవో, అర్చకుల బృందం, మక్తల్ ఎమ్మెల్యే శ్రీ వాకిటి శ్రీహరి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ  అరవింద్ రెడ్డి, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.