చిక్కడపల్లి ఇన్స్‌పెక్టర్‌కు ‘నిరుద్యోగ జేఏసీ’ సన్మానం
ముషీరాబాద్, జూలై 14(విజయక్రాంతి): చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సీఐ మధుబాబును నిరుద్యోగ జేఏసీ నాయకులు, సిటీ సెంట్రల్ లైబ్రరీలో పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులు మర్యాద పూర్వకంగా భేటీ అయి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మధుబాబు మాట్లాడుతూ నేను కూడా అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన వాడినని, నిరుద్యోగ అభ్యర్థులకు పోటీ పరీక్షల గురించి పలు రకాల సలహాలు, సూచనలు చేశారు.
రాబోయే ప్రభత్వ ఉద్యోగ నోటిఫికేషన్లలో అందరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి మంచి స్థితిలో ఉండాలని ఇన్స్పెక్టర్ తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా భా ద్యతలు చేపట్టినా నిరుద్యోగ ఇన్స్పెక్టర్ ను ని రుద్యోగ జేఏసీ నేతలు శాలువాతో సత్కారం చేశారు. సీఐ ని కలిసిన వారిలో నిరుద్యోగ జేఏసీ నేతలు శంకర్ నాయక్, నరేష్, కుమార్, నరసింహ, రవి, సంతోష్, శ్రీను, మహేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.






