7 July, 2026 | 7:59 PM

Breaking News

ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి   •   రహదారిపై వరి నాట్లు వేస్తూ నిరసన   •   రోడ్డు భద్రత, ఆటో రిక్షాలో ప్రయాణం, మాదకద్రవ్యాల నివారణపై అవగాహన   •   మృతుడు బొల్లె ప్రశాంత్ కుటుంబానికి స్నేహితుల ఆర్థిక సహాయం   •   జిల్లాలో రైతులకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయి   •   బాన్సువాడ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటి   •   పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి: ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   ఐకెపి రుణాలలో తాండూర్ అత్యధిక ఓవర్ డ్యూ   •   సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •  

స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి

30-09-2024 12:05 PM

రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో స్కూల్ బస్ కిందపడి నర్సరీ చదువుతున్న ఓ చిన్నారి మృతి చెందిన విషాధ ఘటన సోమవారం చోటుచేసుకుంది.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నామాపూర్ గ్రామానికి చెందిన సల్కం భూమయ్య- వెంకటవ్వ కూతురు మనోజ్ఞ (3) ముస్తాబాద్ మండలకేంద్రంలో మహర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో నర్సరీ చదువుతుంది. పాఠశాల వద్ద జరిగిన ప్రమాదంలో బస్ టైర్ పాప తలపై నుండి వెళ్లడంతో అక్కడిక్కడే మృతి చెందింది. బాలిక తల్లి ఇంటి వద్ద అంటూ వ్యవసాయ పనులు  చేస్తూ ఉండగా  ఉపాధి నిమిత్తం తండ్రి గల్ఫ్ లో  ఉన్నాడు. చిన్నారి మృతితో విషాదం నెలకొంది.