21-02-2026 12:27:59 AM
మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): ఎల్లంపేట్ కు చెందిన పాణి నరేష్ కుమార్ భార్య సుగ్య నాయక్ (31) పురిటి నొప్పులతో బాధపడుతున్న సందర్భంగా 108 అంబులెన్స్ లో సిబ్బంది చికిత్స అందించి పురుడు పోశారు. శుక్రవారం ఎల్లంపేటలో గర్భిణీ పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బందికి ఫోన్ చేయగా ఈఎంటి సీతారాం,పైలట్ తిరుపతి హుటా హుటిన సంఘటన చేరుకున్నారు.
అనంతరం గర్భిణీ స్త్రీ సుగ్య నాయక్ కు నొప్పులు అధికం కావడంతో ఆసుపత్రి కి వెళ్ళే సమయం లేక పోవడంతో గమనించిన ఈఎంటి సీతారాం ఈ.ఆర్.సి.పి డాక్టర్ శివ సూచనల మేరకు ఇంటి లోపలే పురుడు పోసినట్టు చెప్పారు.ఈ నేపథ్యంలో గర్భిణీ స్త్రీ సుగ్య నాయక్ ని అంబులెన్స్ సిబ్బంది సహకారంతో పండంటి ఆడపిల్లకు మధ్యాహ్నం ఒకటి 55 నిమిషాలకి జన్మనిచ్చిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ లో ప్రసవించిన తల్లి కూతురు ఇద్దరు క్షేమంగా ఉన్నారని ప్రసవం తరువాత సంరక్షణ కోసం తల్లి బిడ్డలను దగ్గరలో ఉన్న మేడ్చల్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించినట్లు 108 సిబ్బంది వెల్లడించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి తల్లి బిడ్డలను కాపాడినందున సుజ్ఞాని కుటుంబ సభ్యులు ఈఎంటి సీతారాం పైలట్ తిరుపతి లకు కృతజ్ఞతలు తెలియజేశారు.