26 June, 2026 | 4:57 PM

మత్తు పదార్థాల నివారణపై 2K రన్

26-06-2026 03:44 PM

- బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు, యువతకు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు  బెల్లంపల్లి లో పోలీసుల ఆధ్వర్యంలో 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి ఏసీపీ వి. కిరణ్ కుమార్ మాట్లాడారు. బెల్లంపల్లి 1 టౌన్ సీఐ కే. శ్రీనివాస రావు ఆధ్వర్యంలో తిలక్ స్టేడియం నుండి కంటా చౌరస్తా వరకు ఈ రన్ కొనసాగింది.

ఈ సందర్భంగా ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగాఉండాలన్నారు. చదువు, క్రీడలు, ఉపాధిపై దృష్టి పెట్టాలని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచాలని సూచించారు. మత్తుకు బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు, తిలక్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు, యువత, బెల్లంపల్లి 1 టౌన్ పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.