26 June, 2026 | 3:47 PM

కొమ్ముగూడెంలో యువతకు టైలరింగ్ శిక్షణ

26-06-2026 02:58 PM

శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ కల్తి భద్రయ్య

కారేపల్లి,(విజయ క్రాంతి): ఐటీడీఏ భద్రాచలం ఆధ్వర్యంలో యువతకు ఉపాధి శిక్షణలో భాగంగా యువ శిక్షణ కేంద్రం ఇల్లందు వారిచే సింగరేణి మండలం కొమ్ముగూడెం లో టైలరింగ్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని సర్పంచ్ కల్తి భద్రయ్య శుక్రవారం ప్రారంభించారు. ఈ శిక్షణ కేంద్రంలో యువతులకు అడ్వాన్స్ కుట్టు పని, బ్లౌజ్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ, డ్రెస్ మేకింగ్ పై శిక్షకులు ట్రైనింగ్ ఇస్తున్నారు. శిక్షణార్థులకు సర్పంచ్ కల్తి భద్రయ్య శిక్షణా మెటీరియల్ ను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... శిక్షణ పొందిన యువతులకు సర్టిఫికెట్ల ఇవ్వడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపటం ఈ శిక్షణ ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో కారేపల్లి సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్, గ్రామపంచాయతీ సెక్రటరీ లోకేశ్వరి, వైటీసీ మేనేజర్ సన్నీ, శిక్షకులు విజయకుమారి, చైతన్య కుమార్, మల్లయ్య, వార్డ్ నెంబర్ పెనక నాగేష్, కరపటి భవాని  తదితరులు పాల్గొన్నారు.