26 June, 2026 | 3:43 PM

తెలంగాణకు కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు నియామకం

26-06-2026 03:10 PM
  1. ఈ నెల 30న రామకృష్ణరావు పదవీవిరమణ
  2. కొత్త సీఎస్ 1992 బ్యాచ్ చెందిన ఐఏఎస్ అధికారి
  3. కేంద్ర సర్వీసు నుంచి తెలంగాణకు సంజయ్ జాజు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు(Sanjay Jaju) నియామకం అయ్యారు. సీఎస్ గా సంజయ్ జాజును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ రామకృష్ణరావు ఈ నెల 30న పదవీవిరమణ చేయనున్నారు. కేంద్ర సర్వీసు(Central Service) నుంచి సంజయ్ జాజు ఇటీవలే తెలంగాణ కేడర్(Telangana Cadre)కు తిరిగి వచ్చారు. 2029 ఫిబ్రవరి వరకు సంజయ్ జాజు సర్వీసులో ఉండనున్నారు. 2014 నుంచి సంజయ్ కేంద్రప్రభుత్వ సర్వీసులో ఉన్న సంజయ్ జాజు విజయవాడ సబ్ కలెక్టర్, పశ్చిమగోదావరి కలెక్టర్, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ కమిషనర్(GHMC Additional Commissioner)గా విధులు నిర్వహించారు.