27 June, 2026 | 7:15 PM

Breaking News

సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •   పల్స్ పోలియోను విజయవంతం చేయండి   •   ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి   •   జగన్నాధపురంలో వనమహోత్సవం   •  

పిల్లలకు సరైన పోషకఆహారంతోనే ఎదుగుదల

11-04-2025 12:06 AM

ఇంచార్జి సీడీపీఓ బాలీశ్వరి

పెబ్బేరు ఏప్రిల్ 10: పిల్లలకు అటు గర్భిణీ స్త్రీలకు సరైన పోషకాహారం అందించటంతోనే వారు ఆరోగ్యంగా, ధృడంగా తయారౌతారని ఇన్చార్జి సీడిపీఓ బాలీశ్వరి గురువారం తెలిపారు. మండ్ల పరిధిలోని రంగాపురం గ్రామంలోని అంగన్వాడీ కేం ద్రంలో పోషన్ పక్వాడ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రాజెక్టులో భాగంగా జిల్లా సంక్షే మ అధికారి సుధారాణి మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన పోషక పదార్థాలు వాటి ఉపయోగం గురించి వివరించారు.

పిల్లల తల్లులకు ప్రీ స్కూల్ గురిం చి వాటి విధానం గురించి పూర్తి స్థాయిలో వివరించాలని సూచించారు. అనంతరం ఓ చిన్నారికి అన్న ప్రాసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఏసిడిపిఓ ఝాన్సీ, లక్ష్మి, సూపర్ వైజర్ వినోద, ఎం ఎల్ ఓహెచ్పీ వినీల, ఏఎన్‌ఎం శివకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు నర్మద, రాధ, లలిత, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.