15 June, 2026 | 9:27 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •  

పిల్లలకు తప్పనిసరిగా బయోమెట్రిక్ నవీకరణ చేసుకోవాలి

30-12-2025 12:00 AM

కలెక్టర్ సంతోష్

గద్వాల, డిసెంబర్ 29 : జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉన్న 05 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాల వయస్సు పూర్తయిన  పిల్లలకు ఆధార్లో బయోమెట్రిక్ నవీకరణ తప్పనిసరిగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ  మార్గదర్శకాల ప్రకారం, ఈ వయస్సులలో పిల్లల వేలిముద్రలు , కంటి మణులు , ఫోటో మార్పులకు లోనవుతాయని దృష్టిలో ఉంచుకొని, ఆధార్ వివరాల ఖచ్చితత్వాన్ని నిలుపుకోవడానికి ఈ నవీకరణ అవసరమని జిల్లా కలెక్టర్ తెలిపారు.

జిల్లా లోని ఆధార్ సెంటర్ లలో తల్లిదండ్రులు / సంరక్షకులు తమ పిల్లల ఆధార్ నవీకరణను సమీపంలోని ఆధార్ నమోదు / నవీకరణ కేంద్రంలో సంబంధిత దృవీకరణ పత్రాలతో తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించడమైనది. సకాలంలో బయోమెట్రిక్ నవీకరణ చేయించుకోకపోతే, భవిష్యత్తులో పాఠశాల ప్రవేశాలు, ప్రభుత్వ పథకాలు, పరీక్షలు మరియు ఇతర సేవలలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అర్హత కలిగిన ప్రతి పిల్లవాడి ఆధార్ బయోమెట్రిక్ నవీకరణను వెంటనే పూర్తి చేయించుకోవాలని సంబంధిత అధికారులు అవగాహన కల్పించాలని, ఆధార్ నిర్వాహకులు పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.