calender_icon.png 30 December, 2025 | 6:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సార్ల్లు.. సమయానికి రారు!

30-12-2025 12:00:00 AM

ఇష్టారీతిన విధులకు హాజరు

కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ

అచ్చంపేట, డిసెంబర్ 29: ఇటీవలే గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు కొలుదీరాయి. సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కూడిన అధికార పాలన ఆరంభమైంది. ప్రజలు ఇన్ని రోజుల తమ సమస్యలు ఏకరువు పెట్టేందుకు ప్రజాప్రతినిధుల ద్వారా అధికారుల ను కలిసేందుకు ప్రయత్నిస్తుంటారు. అందులోనూ ప్రధానమైన ఫించన్లు, ఇందిరమ్మ ఇళ్లు, గ్రామాలకు రహదారులు, వీధిదీపా లు, మురుగు కాల్వలు.. ఇలా ఒక్కటేమిటీ అనేక అంశాలపై వినతులు అందించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆయా సమస్యలను తెలియజేసేందుకు ప్రధానమైనది మండల ప్రజా పరిషత్ కార్యాలయం.

కనిపించని ప్రజావాణి

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తప్పని సరిగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిం ది. ఆ సమయంలో ప్రజలు తమ వినతులను నేరుగా అధికారులకు ఇవ్వొచ్చు. కానీ అచ్చంపేటలోని ఎంపీడీవో కార్యాలయం అధికారులకు ఆవేమీ పట్టడం లేదు. ఎందుకంటే ఇక్కడ కార్యాలయంలో విధులు నిర్వహించే కీలకమైన అధికారులెవరూ సమ యానికి రాకపోవడమే. సోమవారం జరగాల్సిన ప్రజావాణిలో ఏ ఒక్క అధికారి పాల్గొ నలేదు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఎంపీడీవో, సూపరిండెంట్, సీనియర్ అసిస్టెంట్ రాలేదు.

కేవలం జూనియర్ అసిస్టెం ట్, ఒకరిద్దరూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాత్రమే కనిపించారు. కార్యాలయ సహాయకుల్లోనూ ఇద్దరు మాత్రమే ఉన్నారు. సరి గ్గా మధ్యాహ్నం 12 గంటల సమయంలో కార్యాలయం సూపరిండెంట్ విధులకు హాజరయ్యారు. కార్యాలయంలో ప్రతీ ఉద్యో గి విధులకు తప్పని సరిగా హాజరు పర్యవేక్షణ, వారి పనితీరును చూడాల్సిన బాధ్యత ఆయనదే. కానీ ఆయనే విధులకు ఇష్టాతీరు గా వస్తుండటం వలన మిగతా వారి పర్యవేక్షణ గాలిలో దీపంలా మారింది. పైగా ఆది వారం సెలవు రోజు ఉంటే.. ఒక రోజు ముం దుగానే అంటే శనివారం మధ్యాహ్నం నుం చే విధులకు డుమ్మా కొడుతున్నారు. కేవలం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతోనే కార్యాలయంలోని సిబ్బంది పనితీరు ఇష్టాతీరుగా మారిందనే విమర్శలు ఉన్నాయి.

ఎవరికి చెప్పుకోవాలి..

కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆందోళన చెందుతు న్నారు. రెగ్యులర్ ఎంపీడీవో ఉన్నా.. కింది స్థాయి సిబ్బంది పనితీరును చూసిచూడనట్లు వదిలేయడం ఆయన పనితీరును వెల్లడిస్తోంది. ఆయన సైతం విధుల్లో ఇదే విధంగా వ్యవహరిస్తుండటంతోనే ఇలా జరగుతున్నట్లు తెలుస్తోంది. ఎవరైన అధికారుల డుమ్మా గురించి అడిగితే.. కార్యాలయం పనుల గురించి జడ్పీ, లేదా ఇతర కార్యాలయాలకు వెళ్తున్నట్లు అక్కడున్న అటెండర్లు సమాదానం ఇస్తున్నారు. పైగా అధికారుల వ్యక్తిగత పనులను చేస్తూ వారి మెప్పు పొందేందుకు.. ఎప్పటికప్పుడు కార్యాలయానికి వచ్చిపోయే వారి గురించి సమాచారాన్ని చేరవేస్తూ స్వామిభక్తిని ప్రదర్శిస్తున్నారు.

ఎంతో దూరం నుంచి..

నాకు గతంలో దివ్యాంగ ఫించను వచ్చేది ఆ తర్వాత తీసేశారు. అడిగితే కొన్ని రోజులు ఇచ్చి మళ్లీ ఆపేశారు. ఇప్పుడు ఆరు నెలలుగా నాకు ఫించను రావడం లేదు. దీని గురించి పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశాను. అయినా ఫించను రాలేదని.. ఇక్కడున్న సార్లను కలిసి విన్నవించేందుకు వచ్చాను. ఇక్కడ ఎవరూ లేరు. అడిగితే కొంచె సమయం వేచి ఉండమని చెబుతున్నారు.  ఉదయం 10: 30 గంటలకు వచ్చి, 12 గంటల వరకు ఎవరు రాలేదు. పైగా మాది ఎంతో దూరంలోని మన్నవారిపల్లి గ్రామం. నాలాంటి వారు ఆపీసుకు వస్తే ఎవరికి చెప్పాలో తెలియడం లేదు.

-రాములమ్మ, 

మన్నెవారిపల్లి