పిల్లలకు నులిపురుగుల మాత్రలు వేయించాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు శిరీష..
చిన్న చింతకుంట: ఈనెల 11న నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పిల్లల్లో నులిపురుగుల నివారణకు మాత్రలను తప్పనిసరిగా వేయించాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు శిరీష తెలిపారు. బుధవారం ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాలు నిండిన బాలలకు నులిపురుగుల నివారణకు గాను ఆల్ఫెండజోల్ మాత్రను వేయించాలన్నారు. నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమానికి తహసిల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ, ఐసిటిసి సిబ్బంది, ఉన్నత పాఠశాల, కేజీబీవీ, జూనియర్ కళాశాలలకు సంబంధించిన అధికారులందరూ టాస్క్ ఫోర్స్ గా ఏర్పడి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లను తహసిల్దార్ ఎల్లన్నకు వివరించినట్లు ఆమె తెలిపారు. ఎన్ డిడి ప్రకారం ఒకటి నుంచి 19 సంవత్సరాల పిల్లలు 77 33 మంది ఉన్నారని ఆమె తెలిపారు వీరందరికీ తప్పనిసరిగా ఆల్ఫెండజోల్ మాత్రలు వేయించాలని ఆమె కోరారు.






