29 June, 2026 | 2:02 AM

నిజాంసాగర్ మండలంలో పల్స్ పోలియో

29-06-2026 12:00 AM

నిజాంసాగర్, జూన్ 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ప్రతి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఆశ వర్కర్లు హెల్త్ సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు  చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు. మండలంలోని  బంజపల్లి గ్రామపంచాయతీలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏలే సుగుణమ్మ  పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘పోలియో రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యవంతమైన భవిష్యత్తుకు బాటలు వేయాలి‘ అని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. గ్రామంలోని అర్హులైన చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేలా వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.