15-11-2025 12:03:17 AM
నిర్మల్, నవంబర్ ౧౪ (విజయక్రాంతి): నిర్మ ల్ గ్రామీణ మండలం కొండాపూర్ లోని బాల సదనంలో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవా రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీవాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్న పిల్లలతో కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించారు.
ముందుగా ఉన్నతాధికారులు చిన్నారు లతో ముఖాముఖి మాట్లాడుతూ, వారి అభిరుచులు, చదువు, అవసరాలు తెలుసుకు న్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత నిర్మల్ బాల సదనమే పిల్లలకు ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు అందించిన సంస్థగా నిలిచిందని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఈ కార్డులతో పిల్లలు పూర్తిగా ఉచిత వైద్య సేవలను పొందగలరని చెప్పారు.
అలాగే ప్రభుత్వం జారీ చేసే ఇతర గుర్తింపు పత్రాలను కూడా ప్రత్యేకంగా పిల్లల కోసం సిద్ధం చేసినట్లు వివరించారు. ఇటీవల విద్యార్థులను హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంకి వైజ్ఞానిక యాత్రగా తీసుకెళ్లిన విషయాన్ని గుర్తుచేసిన కలెక్టర్, పిల్లలంతా ప్రతిరోజూ పాఠశాలకు వెళుతూ చక్కగా చదువుకోవాలని సూచించారు. పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లి చదువుతోపాటు రోజు ఆటల్లో పాల్గొనాలని ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి సూచించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, పిల్లలకు బట్టలు, దుప్పట్లు, ఫలాలు కలెక్టర్, జిల్లా జడ్జి, అదనపు కలెక్టర్లు అందజేశారు.అలాగే బాల సదనంలోని డార్మెటరీ, వంటగది, ఇతర పరిసరాలను పరిశీలించిన ఉన్నతాధికారులు, పిల్లలకు ప్రతిరోజూ మంచి, పోషకాహార కలిగిన భోజనం అందించాలని, పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థాని క సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డిఎల్‌ఎసిఎస్ సెక్రటరీ రాధిక, డీఈవో భోజన్న, ఎంపీడీవో గజానన్, ఐసిడిఎస్ అధికారి మురళి పాల్గొన్నారు.