14-11-2025 10:15:09 PM
తాండూరు,(విజయక్రాంతి): నేటి బాలలే... రేపటి పౌరులనీ... దేశ భవిష్యత్తు అంతా మీ చేతుల్లోనే ఉందని..రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శంకర్ స్వామీజీ అన్నారు. బషీరాబాద్ మండలం దామర్చేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. శ్రీ మాణికేశ సంస్థానం ట్రస్టు తరపున 35 మంది 10వ తరగతి విద్యార్థులకు జామెంట్రీ బాక్సులు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.