14-11-2025 10:12:04 PM
* ఉద్యోగుల జీతాలు తక్కువ పని గోస ఎక్కువ
* గత రెండు నెలలుగా జీతాలు లేక కుటుంబాలు రోడ్ల పాలు
* పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వo
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ జిల్లాలో ఎన్ హెచ్ఎంల కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న అన్ని విభాగాలకు సంబంధించిన ఉద్యోగులు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ ఎం.డి రుక్ముద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్ల బ్యార్జిలతో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రెండు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలి.
ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించాలి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరికీ సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలి. కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ చేయాలి. ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల సెలవులు మంజూరు చేయాలి. ఏ జిల్లాలో పనిచేస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు డిప్టేషన్లు, ట్రాన్స్ఫర్లు కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.