calender_icon.png 14 November, 2025 | 11:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలల పరిరక్షణ చట్టాలను పక్బందికగా అమలు

14-11-2025 10:17:49 PM

మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు

బేల,(విజయక్రాంతి): మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని బేల ఎంపీడీవో ఆంజనేయులు అన్నారు. శుక్రవారం మండల కార్యాలయంలో బేల మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీనీ ఎంపీడీవో అధ్యక్షతన ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ స్వామి పలు విషయాలు, చట్టాలపై శిక్షణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో ఆంజనేయులు మాట్లాడుతూ... బాలలకు సురక్షితమైన ఎదిగే వాతావరణం అందించడం కొరకు మండల స్థాయి బాలల పరిరక్షణ కమిటీ పర్యవేక్షణ చేస్తుందన్నారు. కమిటీ ద్వారా ప్రతి రెండు మూడు నెలల కు ఒక్కసారి సమావేశం తో పాటు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సంబంధింత మండలం అధికారులకు ఆదేశాలు ఇవడం జరుగుతుందనరు. మండలంలో బాల కార్మికులు, బాల్య వివాహాలు లేని మండలంగా మార్చేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.