17 April, 2026 | 11:14 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

చంద్రగ్రహణం వేళ చిలుకూరు బాలాజీ ఆలయం మూసివేత

03-03-2026 12:19 AM

మొయినాబాద్, మార్చి 2: చంద్రగ్రహణం పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ దేవాలయం తాత్కాలికంగా మూసివేస్తునట్లు ఆలయ అర్చకులు మరియు అధికారులు వెల్లడించారు. మంగళవారం మార్చి 3 ఉదయం 7:30 గంటలకు నిత్య కైంకర్యాలు ముగిసిన వెంటనే ఆలయ ద్వారాలు మూసివేస్తారు.

గ్రహణం వీడిన అనంతరం సాయంత్రం 7 గంటలకు ఆలయంలో సంప్రదాయబద్ధంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో కూడా భక్తులను లోపలికి అనుమతించరు.తదుపరి రోజు అంటే బుధవారం ఉదయం 6 గంటల నుండి భక్తులు యధావిధిగా స్వామివారిని దర్శించుకోవచ్చని చెప్పారు.భక్తులు గమనించి, తమ ప్రయాణాలను మరియు దర్శన సమయాలను తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని ఆలయ నిర్వహణ కమిటీ విజ్ఞప్తి చేసింది.