11 April, 2026 | 2:32 PM

18 రోజుల్లోనే చైనా అత్యంత సంపన్నుడి పతనం

30-08-2024 12:00 AM

మూడు వారాల్లోనే మొదటి ర్యాంకు కోల్పోయిన హుయాంగ్

న్యూఢిల్లీ, ఆగస్టు 29: టెము సంస్థ వ్యవస్థాపకుడు కొలిన్ హుయాంగ్ కేవలం 18 రోజుల్లోనే చైనా అత్యంత సంపన్నుడి హోదాను కోల్పోయారు. ఆగస్టు 8న బాటిల్డ్ వాటర్ బిలియనీర్ అయిన ఝాంగ్ శాన్షన్‌ను వెనక్కు నెట్టి హుయాంగ్ చైనాలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. గత మూడేళ్లలో ఓ టెక్ సంస్థ అధిపతి చైనాలో రిచెస్ట్ పర్సన్‌గా అవతరించడం ఇదే తొలిసారి.

అయితే, ఆగస్టు 26న టెము మాతృసంస్థ పీడీడీ షేర్లు పడిపోవడంతో తన సంపదలోని 14.1 బిలియన్ డాలర్లను అందులోకి పంపడంతో తన ర్యాంకును కోల్పోవాల్సి వచ్చింది. శాన్షన్ నికర సంపద కూడా 4 బిలియన్ డాలర్లు పడిపోయింది. ప్రపంచంలోని అనేక పెద్ద వ్యాపారాలు మందగమనాన్ని ఎదుర్కొంటున్న వేళ చైనాలో వినియోగంపై దీర్ఘకాలిక అస్థిరమైన విశ్వాసాన్ని ఈ బిలియనీర్ల పతనాలు నొక్కి చెబుతున్నాయి.