26 August, 2026 | 6:52 PM

బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులుగా చింతల భూపాల్

26-08-2026 05:57 PM

చేగుంట ఆగస్ట్ 26, విజయక్రాంతి: సిద్దిపేట జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులుగా చేగుంట పట్టణనికి చెందిన చింతల భూపాల్ ని నియమించినట్లు  జిల్లా బిజెపి అధ్యక్షులు బైరీ శంకర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు, ఈ సందర్బంగా చింతల భూపాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ సిద్దిపేట్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎంపీ మాధవ నేని రఘునందన్ రావుకి జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ కి  కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ బలోపేతానికి ప్రజా సమస్యల పరిష్కారానికి నా వంతుగా కృషి చేస్తానని అన్నారు.