26 August, 2026 | 6:57 PM

బీసీలను చైతన్యం చేస్తాం

26-08-2026 05:57 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని 90 శాతం మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు సామాజిక రాజకీయ చైతన్యాన్ని కలిగించడమే జేఏసీ లక్ష్యమని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న అన్నారు. బుధవారం మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులకు విద్యావంతులకు అవగాహన సమావేశం నిర్వహించి, మండల కమిటీని ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ విశారదన్ మహరాజ్ నాయకత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీలు సామాజికంగా చైతన్యం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు రామగిరి రవీందర్, జిల్లా కార్యదర్శి కల్లూరు సుధాకర్,జిల్లా నాయకులు కుందూరు వినోద్,మేకల సింహం తదితరులు పాల్గొన్నారు.

మండల కమిటీ ఎన్నిక: 

బుధవారం మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మండల కమిటీని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడుగా బొడిగెల రాహుల్, ఉపాధ్యక్షులుగా అల్లాడి నరసయ్య, దోకూర్ భీమలింగం, జాదవ్ సుధర్ సింగ్, జంగం సాయన్న, ప్రధాన కార్యదర్శిగా రాథోడ్ సంతోష్, కార్యదర్శిగా శ్రీ గాదె గోవర్ధన్, ముద్రం దినేష్, కండెల అంజయ్య, చాట్ల శ్రీధర్, సోషల్ మీడియా ఇన్చార్జిగా కుందూరు వినోద్, గౌరవ సలహాదారులుగా కండెల రాము,పిల్లి సంతోష్, మేకల సింహం, సర్పంచ్ కునేరు భూమన్న, సర్పంచ్ ఆడే అంబాజీ, సామల వీరన్న లను ఎన్నుకున్నారు.