ఘనంగా చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు
కోకాపేటలో మొక్కలు నాటిన ఏపీ గ్రీన్ చైర్మన్ నాగేంద్రబాబు
హైదరాబాద్, ఆగస్టు 22(విజయక్రాంతి): మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ప్రముఖ నటుడు, నిర్మా త, ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ, ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగేంద్రబాబు హైదరాబాద్‌లోని కోకాపేటలో మొక్కలు నాటి వినూత్నంగా వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడి యం నర్సరీల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన కదంబ వృక్షం (కదంబవాసిని) మొక్కను నాటారు.
ఈ జాతి మొక్కల ప్రాధాన్యతను వివరిస్తూ 1.5 నుంచి 2 సంవత్సరాల వయసున్న ఈ మొక్క ఏపుగా పెరిగి, దట్టమైన పచ్చదనంతో పాటు దాదాపు 10 నుంచి 15 డిగ్రీల వరకు వేడిని తగ్గించే చల్లని నీడను అందిస్తుందని, అలాగే టెన్నిస్ బాల్ ఆకారంలో సువాసనభరితమైన పూలను పూ స్తుందని నాగబాబు తెలిపారు.
ప్రకృతితో ముడిపడి ఉన్న ఈ వేడుకపై నాగబాబు స్పందిస్తూ అన్నయ్య పుట్టినరోజు సందర్భం గా ఇలా మొక్కలు నాటడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చింది. తాత్కాలికమైన ఆడంబరాలతో వేడుకలు చేసుకోవడం కం టే, భవిష్యత్ తరాలకు ప్రాణవాయువుని స్తూ, అందరికీ మేలు చేసే ఒక చెట్టును నాటడం ఎంతో అర్థవంతమైన మార్గం అ న్నారు. తమ ప్రియమైన వారి పుట్టినరోజుల సందర్భంగా కనీసం ఒక మొక్కనైనా నాటాలని పిలుపునిచ్చారు.






