23 August, 2026 | 2:53 AM

ఆదివాసుల సమస్యలను పరిష్కరించాలి

23-08-2026 12:42 AM

రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ కు తుడుం దెబ్బ ఆధ్వర్యంలో వినతి పత్రం

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని  ఆదివాసి గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను  గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు   పరిష్కరించాలని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు  పేందూరు దాదేరావ్  వినతి పత్రం అందజేశారు. శనివారం ఉట్నూర్ పర్యటనకు వచ్చిన సందర్భంగా  తుడుం దెబ్బ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. జీవో నెంబర్ 3 కొనసాగింపు MS.GO.no:3 ను ఎలాంటి మార్పులు లేకుండా యథావిధిగా కొనసాగించాలన్నారు.

ఉద్యోగాల భర్తీ చేసి ఏజెన్సీ ప్రాంతంలోని 29 ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను స్థానిక ఆదివాసీ గిరిజన నిరుద్యోగులతోనే భర్తీ చేయాలి. 1/70 చట్టం అమలు  ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఆశ్రమ పాఠశాలల సమస్యలు ప్రతి ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులకు యూనిఫారాలు, ఇతర విద్యా సామాగ్రిని వెంటనే అందించి న్యాయం చేయాలి.గురుకులాల్లో సీట్ల సంరక్షణ: TWRJC & URJC గురుకుల పాఠశాలల్లో గిరిజన విద్యార్థుల సంఖ్య తగ్గకుండా చూడాలన్నారు.