18-07-2025 06:32:13 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి 2025-2026 సంవత్సరానికి గ్రీన్ భద్రాద్రి నూతన కార్యవర్గాన్ని శుక్రవారం రెడ్ క్రాస్ కార్యాలయం వద్ద ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా చిట్టే లలిత, ప్రధాన కార్యదర్శిగా లకావత్ వెంకటేశ్వర్లు (ఎల్.వి), కోశాధికారిగా పూసం రవికుమారి, వైస్ ప్రెసిడెంట్లుగా సుబ్రహ్మణ్యం, తుమ్మల రాణి, కో ఆర్డినేటర్ గా లాయర్ పామరాజు తిరుమలరావు, జాయింట్ సెక్రటరీగా కమ్మ వాణిరామ్ లను ఏకగ్రీవంగా ఎంపిక చేయటం జరిగింది. తనని అధ్యక్షురాలుగా నియమించిన సంస్థ పెద్దలకి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రీన్ భద్రాద్రి ఆశయాలను ముందుకు తీసుకొని వెళ్తానని, భద్రాచలం పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా తీర్చి దిద్దటానికి తనవంతు కృషి చేస్తానని నూతన అధ్యక్షురాలు చిట్టే లలిత తెలిపారు.