18-07-2025 06:37:56 PM
స్థానిక సంస్థలఎన్నికల సన్నాహక సమావేశం
కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్, స్థానాల్లో విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డిలో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. తన స్వగృహంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాట్లాడుతూ... గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందన్నారు.
హడావిడిగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మరోసారి దొంగనాటకానికి తెర లేపారని అన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసిన తరువాత ఆర్డినెన్స్ చేసిన చెల్లెధని మేధావులు చెబుతున్నా పట్టించుకోకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాట్లాడించారని, హామీనే మర్చిపోయారని విమర్శించారు. సర్పంచ్, జెడ్పిటిసి, మున్సిపల్, ఎన్నికలు వేరువేరుగా పెట్టిన ఒకేసారి పెట్టిన ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బి.ఆర్.ఎస్ నాయకులకు సూచించారు.
నాయకులు గ్రామాల వారిగా, మండలాల వారిగా కార్యకర్తలను సమాయత్తం చేయాలని సూచించారు. ఎన్నికల్లో కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్న మహిళలకు రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం, పెన్షన్ రూ.4000 కు పెంచి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి మర్చిపోయారని, ఇది ప్రజలకు వివరించాలాన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు దగ్గర పడుతున్న స్థానిక ఎన్నికల నిర్వహించడం లేదని కోర్టు మొట్టికాయ వేస్తే ఎన్నికలు హడావిడిగా నిర్ణయించడానికి ప్రభుత్వం సమాయత్త అయ్యిందని విమర్శించారు.