27 June, 2026 | 7:32 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!

16-03-2026 02:42 PM
  1. ఓటీఎస్ స్కీమ్ ద్వారా ప్రభుత్వానికి రూ. 320 కోట్ల ఆదాయం
  2. ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీతో పన్ను చెల్లించే అవకాశం
  3. ఓటీఎస్ స్కీమ్ ను అందరూ వాడుకోవాలి: జీహెచ్ఎంసీ కమిషనర్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్నుకు సంబంధించి వివరాలను సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్‌(GHMC Commissioner RV Karnan ) వివరించారు. ఆస్తి పన్ను వడ్డీపై 90 శాతం రాయితీతో పన్ను చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. మార్చి 31 వరకు ఆస్తి పన్ను వడ్డీపై రాయితీతో చెల్లించాలని కోరారు.

ఓటీఎస్ స్కీమ్(OTS Scheme) ను అందరూ వాడుకోవాలని పిలుపునిచ్చారు. 28 లక్షల ఆస్తి పన్నుల్లో 18 లక్షల మంది ఆస్తి పన్నులు చెల్లించారని, ఇప్పటి వరకు రూ. 2,186 కోట్ల ఆస్తి పన్ను వసూలు అయ్యాయని పేర్కొన్నారు. ఓటీఎస్ స్కీమ్ ద్వారా ప్రభుత్వానికి రూ. 320 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టబోతున్నమన్న ఆయన పారిశుద్ధ్యంపై ఎక్కువ దృష్టి పెట్టామని తెలిపారు. మెగా ఈ-వేస్ట్ డ్రైవ్(Mega E-waste Drive) చెపట్టామని  కమిషనర్ పేర్కొన్నారు.