16 March, 2026 | 6:04 PM

సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

16-03-2026 02:24 PM

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ ఆవరణలో జడ్చర్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy ) మీడియాతో చిట్ చాట్ చేశారు. సినిమా ఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలు ఎక్కువ ఉన్నాయని అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాప్రతినిధులతో పాటు సినీ ఆర్టిస్టులూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలని పిలుపునిచ్చారు.

90 రోజులకు ఒక్కసారి డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలన్నారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకున్న తర్వాతనే సినిమాలు విడుదలు చేయాలని సూచించారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోకపోతే సినిమాలు విడుదల కావని చెప్పారు. రాజకీయ నాయకులు కూడా గ్రడ్స్ టెస్ట్ చేయించుకోవాలని కోరారు. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోకుంటే ప్రజాప్రతినిధులు అసెంబ్లీకి రావొద్దని తెలిపారు.