16 March, 2026 | 3:23 PM

Breaking News

అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా శ్రీమంతాలు   •   రాష్ట్రం అప్పుల్లో ఉంది..పైసలు లేక పనులు ముందుకు పోతలే   •   యుద్ధాన్ని ఆపాలని సీపీఐ రాస్తారోకో   •   అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •  

గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!

16-03-2026 02:05 PM

గవర్నర్ ప్రసంగం పూర్తిగా డొల్ల.. చిత్తు కాగితం

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు(Telangana Budget Session) ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా(Governor Shiv Pratap Shukla speech) ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి(BRS MLA Prashanth Reddy) మాట్లాడుతూ... ఇచ్చిన ఆరు హామీలను కనీసం గవర్నర్ ప్రసంగంలో కూడా పెట్టలేదని ఆరోపించారు. తెలంగాణ మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన మండిపడ్డారు.

పింఛన్ ను రూ. 4 వేలకు పెంచుతామన్నారు.. అదీ లేదన్నారు. మూడో బడ్జెట్ పెట్టబోతున్నారని, మహిళలకు ఇస్తామన్న రూ. 2500 ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేశారు. రైతు బంధను మూడుసార్లు ఎగ్గొట్టారు. రైతుబంధుపై గవర్నర్(Governor)తో అబద్దాలు చెప్పించారని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ను అమలు చేయట్లేదని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. హామీల అమలుపై ప్రభుత్వం చేతులెత్తేసిందా? అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా డొల్ల.. చిత్తు కాగితమని ప్రశాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.