20 July, 2026 | 5:19 PM

ఘనంగా చొక్కారావు జయంతి

20-07-2026 12:04 AM

ముకరంపుర, జూలై 19 (విజయ క్రాంతి): మాజీ మంత్రి జువ్వాడి చొక్కారావు జయంతి వేడుకలను కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ లో చొక్కారావు విగ్రహానికి రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో పారదర్శకత నీతికి నిజాయితీకి చొక్కా రావు మారు పేరు, వారిని ఆదర్శకంగా తీసుకొని జిల్లా రాజకీయాల్లో ఎదిగా మన్నారు. వారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్తామన్నారు. ఈ కార్యక్ర మంలో సూడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, తదితరులు పాల్గొన్నారు.