21 July, 2026 | 7:14 AM

ఐలాండ్ నిర్మాణ పనుల్లో నాణ్యత కరువు..!

20-07-2026 04:20 PM

- పర్యవేక్షణ లేక నాసిరకం ఇటుక, సిమెంట్, ఐరన్ వాడకంపై ఆరోపణలు

పెంట్లవెల్లి: పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఐలాండ్ ప్రాజెక్టు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాటేజీల నిర్మాణంలో నాసిరకం ఇటుకలు, సిమెంట్, ఐరన్ వినియోగిస్తున్నారని, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారని విమర్శిస్తున్నారు. 48కోట్లతో పర్యాటక అభివృద్ధికి కీలకమైన ఈ ప్రాజెక్టులో నాణ్యత విషయంలో రాజీ పడకుండా సంబంధిత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.